కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయిన రక్షిత్ శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో కొంత కాలం క్రితం విడుదల అయిన అతడే శ్రీమన్నారాయణ మూవీ ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశాడు. ఈ మూవీ తో రక్షిత్ శెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపుని సంపాదించు కున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రక్షిత్ శెట్టి '777 చార్లీ' అనే మూవీ లో హీరో;గా నటించాడు.

మూవీ కి కే కిరణ్ రాజ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ మొత్తంలో కలక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమా కన్నడ వర్షన్ ఇప్పటికే వూట్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా 777 చార్లీ మూవీ కి సంబంధించిన తెలుగు ,  హిందీ ,  తమిళ ,  మలయాళ వర్షన్ ల 'ఓ టి టి' విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.

777 చార్లీ మూవీ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 30 వ తేదీ నుండి తెలుగు ,  హిందీ , తమిళ ,  మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కాక పోతే ఈ సినిమా సెప్టెంబర్ 30 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో పే వ్యూ పద్ధతిలో స్ట్రీమింగ్  కాబోతుంది. మరి ఈ మూవీ తెలుగు ,  తమిళ ,  హిందీ ,  మలయాళ 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: