టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తమ అల్లు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకత కల్పించడానికి ఆయన మెగా నీడ నుంచి బయటకు వచ్చి సాహసం చేసి మరీ నిరూపించారు.
గత కొన్ని రోజుల నుంచి స్టైలిష్ స్టార్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన ఇటీవల ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఎప్పుడైతే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటించారో.. ఇక ఆ రోజు నుంచి పాన్ ఇండియా హీరోగా కూడా మారిపోయారు.. నార్త్ లో కూడా మంచి ఆదరణ పొందుతున్నారు అల్లు అర్జున్.. సినిమాలతోనే కాదు పలు యాడ్స్ ద్వారా కూడా ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ కు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోతున్నారని చెప్పవచ్చు. ఇక పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయం అందుకోవడంతో ఈయనకు ఇలాంటి క్రేజ్ బాగా పెరిగినట్లు సమాచారం. ఇకపోతే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ కోసం పలు కంపెనీలు కూడా తమ బ్రాండ్లను ప్రమోట్ చేయడానికి అల్లు అర్జున్ ను సంప్రదిస్తున్నాయి. ఇక నార్త్ కి సంబంధించిన పలు కంపెనీలు కూడా అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. సినిమాల ద్వారా మరొకవైపు యాడ్స్ ద్వారా బాగా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటికే అల్లు అర్జున్ హైదరాబాదులో పాటు ఇతర నగరాల్లో కూడా ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేశారు. ఇక హైదరాబాదులో కూడా 100 కోట్ల రూపాయల నిర్మాణంతో అందమైన ఇంటిని కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే . ఇప్పుడు గండిపేట ఏరియాలో 10 ఎకరాల విస్తీర్ణంలో అల్లు స్టూడియోస్ నిర్మించారు . ఇక ఈ స్టూడియో కూడా అక్టోబర్ 1వ తేదీన ప్రారంభం కానుంది. ప్రస్తుతం అల్లు స్టూడియోస్ పరిసర ప్రాంతాల్లోనే ఈయన మరొక ఖరీదైన ప్రాపర్టీ కొనుగోలు చేశారని సమాచారం .ఈ ప్రాపర్టీ కోసం అల్లు అర్జున్ 50 కోట్ల రూపాయలు వెచ్చించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: