ఇటీవల కమలహాసన్ ప్రధాన పాత్రలో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం విక్రమ్. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించిన ఈ సినిమా. నిర్మాతలకు భారీగానే లాభాలు తెచ్చిపెట్టింది అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న లోకనాయకుడు కమల్ హాసన్ కి బ్లాక్ బస్టర్ తో ఆకలికి తీర్చిన సినిమా ఇది.


 ఇక ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా ఒక అద్భుతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులందరూ అనుకున్నది ఒక్కటే. ఇన్నాళ్లు చాలా సినిమాలు చూశాం... కానీ సినిమా అంటే ఇలా ఉండాలి అంటూ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అనిపించింది. అయితే సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే చివర్లో 10 నిమిషాల పాటు సూర్య చేసే మాస్ యాక్షన్ మరో ఎత్తు అని చెప్పాలి. రోలెక్స్ పాత్రలో నటించిన సూర్య ప్రేక్షకులు అందరిని కూడా మంత్రముగ్ధుల్ని చేశాడు అని చెప్పాలి. సూర్య పాత్రను చూసినప్పుడు ప్రతి ప్రేక్షకుడికి వావ్ అని అనిపిస్తూ ఉంటుంది.


 అంత పవర్ఫుల్ గా ఉండే సూర్య రోలెక్స్ పాత్రను ఇటీవల జబర్దస్త్ కమెడియన్స్ మాత్రం కామెడీ చేసేసారు. విభిన్నమైన గెటప్స్ లో కనిపించి ప్రేక్షకులను అలరించే గెటప్ శ్రీను ఇటీవలే రోలెక్స్ పాత్రలో ఒక స్కిట్ చేశాడు. ఈ క్రమంలోనే పవర్ ఫుల్ డైలాగ్స్ చెబుతూ ఉండగా అన్నపూర్ణ స్టేజ్ మీదకి వచ్చి చిన్నపిల్లల జామ్ మొత్తం పాడుచేసి షర్ట్ మీద చల్లుకుందే కాక ఇంకా మాట్లాడుతున్నావా అంటూ పరువు తీస్తుంది. ఆ తర్వాత రోలెక్స్ కాదు సర్ అని పిలవాలి అంటూ గెటప్ శ్రీను చెప్పగా పక్కన నువ్వు కమెడియన్స్ అందరూ పో బే అంటారు. ఇలా సీరియస్ రోలెక్స్ పాత్రతో చివరికి జబర్దస్త్ కమెడియన్స్ కామెడీ పండించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: