ప్రేక్షకులందరికీ ఎప్పుడు లేని విధం గా సరికొత్తగా ఎంటర్టైర్మెంట్ అందించేందుకు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్బాస్ కార్యక్రమం ఎందుకో సీజన్ గడిచే కొద్ది మాత్రం ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడంలో మాత్రం విఫలం అవుతుంది అని చెప్పాలి. ఇక ఇదే బిగ్ బాస్ కార్యక్రమం మొదటి సీజన్లో ఊహించ రీతిలో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంది.  కానీ ఇప్పుడు మాత్రం రేటింగ్ విషయంలో అటు బిగ్ బాస్  దారుణంగా పడిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా బిగ్ బాస్ నిర్వాహకులు ఎలాగైనా షో పై ఇంట్రెస్ట్ మరింత పెంచి రేటింగ్ను పెంచుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.


 ఇందులో భాగంగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ తో సరికొత్తగా టాస్కులు ఆడించి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ బుల్లితెర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో చివరికి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఒక కొత్త కంటెస్టెంట్ ని హౌస్ లోకి తీసుకురావాలి అని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారూ అన్నది తెలుస్తుంది. అయితే ఇలా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్న కంటెస్టెంట్ ఎవరో కాదు మనందరికీ తెలిసిన సుడిగాలి సుదీర్.


 ఇలా సుడిగాలి సుదీర్ మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.  ఇకపోతే ప్రస్తుతం సుడిగాలి సుదీర్ వరుస సినిమాలతో బుల్లితెర  కార్యక్రమాలతో ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అతని ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ఇలాంటి ప్రయోజన సుడిగాలి సుదీర్ ను హౌస్ లోకి పంపిస్తే తమకు కావాల్సిన రేటింగ్ తప్పకుండా వస్తుందని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తున్నారట. ఇది ఎంతవరకు నిజమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: