‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత ప్రముఖ నిర్మాత డివివి దానయ్య రామ్ చరణ్ తో మరో సినిమాను చేయడానికి చాల గట్టిగా ప్రయత్నాలు చేసాడు అని అంటారు. ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాకపోవడంతో దానయ్య మారుతి దర్శకత్వంలో ప్రభాస్ తో ఒక హారర్ కామెడీ మూవీని ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాలు వల్ల ఈమూవీ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ ఉండటంతో దానయ్య దృష్టి ఇప్పుడు బాలకృష్ణ పై పడింది అంటున్నారు.
ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం దర్శకుడు ప్రశాంత్ వర్మ బాలకృష్ణ కాంబినేషన్ లో ఒక మూవీ దానయ్య నిర్మించబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఆహా ‘అన్ ష్టాపబుల్’ షోకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న నేపధ్యంలో అతడికి బాలయ్యకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది అని అంటారు. ఆ సాన్నిహిత్యంతోనే ప్రశాంత్ వర్మ ఒక భారీ యాక్షన్ మూవీ కథను బాలయ్యకు చెప్పడం ఆ కథకు ఓకె చెప్పడం జరిగిపోయింది అని తెలుస్తోంది.
ఆమధ్యనే విడుదలై సంచలనం సృష్టించిన లోకేష్ కనకరాజ్ ‘విక్రమ్’ మూవీ స్థాయిలో అత్యంత భారీయాక్షన్ సీక్వెన్స్ తో బాలయ్య ప్రశాంత్ వర్మల మూవీ ఉంటుంది అని అంటున్నారు. ఈమూవీ ప్రాజెక్ట్ ను దానయ్య భారీ స్థాయిలో తీయడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ ఇలా వరసపెట్టి యాక్షన్ మూవీలు చేస్తూ తనకు ఏమాత్రం వయసు పెరిగి పోలేదని తన అభిమానులకు సంకేతాలు ఇస్తున్నాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి