సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఎన్నో తప్పులు చేసినా కూడా వారి లైఫ్ సాఫీగా సాగుతుంది. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం ఇలా జరగదు.అనుకోకుండా చిన్న తప్పు చేసినా ఆ తప్పు వారి జీవితాన్నే నాశనం చేస్తుంది. హీరోయిన్స్ చేసిన తప్పులే వారి కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికి కారణం అవుతాయి. ఇక ఈ జాబితాలోకే వస్తుంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన శ్రీవిద్య. శ్రీవిద్య తన ఫ్యామిలీ కోసం చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి దగ్గరయింది. అందం అభినయం వుండడంతో తమిళంలో చాలా బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా వెలిగింది. అంతేకాకుండా కెరీర్ తొలినాళ్లలోనే తమిళ స్టార్ నటుడైన కమల్ హాసన్ తో ప్రేమలో పడింది.

ఇక కమల్ హాసన్ అయితే ఆమెను పిచ్చిపిచ్చిగా ప్రేమించారు. పెళ్లి కూడా చేసుకుంటానని వెంట పడ్డారు. కానీ కమలహాసన్ కుటుంబం నీకు ఇప్పుడే పెళ్లి ఏంటి అని వార్నింగ్ ఇవ్వడంతో అతను శ్రీవిద్యకు బ్రేకప్ చెప్పాడట. ఇక శ్రీవిద్య బ్రేకప్ తర్వాత తమిళ సినిమాలు వదిలేసి మలయాళ సినిమాల వైపు తన దృష్టి పెట్టింది. ఇక ఆ తర్వాత మలయాళంలో ఓ సినిమాలో నటిస్తున్న టైంలో ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ జార్జ్ థామస్ ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ అతను ఒక సంవత్సరం బాగానే ఉన్నా ఆ తర్వాత కేవలం డబ్బు కోసం ఆమెను చాలా వేధించేవాడని దాంతో అతనికి విడాకులు ఇచ్చేసి,ఆ తర్వాత మళ్ళీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసే ఫేమస్ డైరెక్టర్ అయినా భరతన్ తో లవ్ లో పడి అతన్ని కూడా పెళ్లి చేసుకుంది.

ఇక అతను పెళ్లి చేసుకొని మూడు సంవత్సరాలు అయ్యాక అతను కూడా ఆమెను వదిలించుకున్నారు. ఇలా జీవితంలో మూడుసార్లు నమ్మిన వ్యక్తులు దగ్గర మోసపోయి తన కెరీర్ చివరి దశలో ఉన్న టైంలో ఆధ్యాత్మికం వైపు వెళ్ళింది. ఇక చివరి దశలో స్పైనల్ కార్డ్ క్యాన్సర్ తో బాధపడుతూన్నప్పటికీ తన ఆస్తిని,ఇంటిని ఓ సంగీత పాఠశాల కు వాడుకోవాలని, అంతేకాకుండా అది కేవలం పేద పిల్లలకు సంగీతం నేర్పించేందుకే ఉపయోగించుకోవాలని కోరుకుంది. ఇక ఇలా కమల్ హాసన్ మొదటి లవర్ ఎన్నో ఇబ్బందులు పడి ముగ్గురి దగ్గర మోసపోయి చివరికి ఎంత డబ్బు ఉన్నా కూడా ఒంటరిగా కన్నుమూసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: