ఇటీవల గరికపాటి నరసింహా రావు చిరంజీవి పై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేకెత్తించాయో అందరి కీ తెలిసిందే. దీనికి చిరు ఫ్యాన్స్ ఓ రేంజ్ లో గరికపాటి పై ఫైర్ అయ్యారు.సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు. చి రంజీవి కి అనుకూలం గా కొందరు నటీ నటులు కూడా గరికపాటి వ్యాఖ్య లపై విమర్శలు చేశారు.

అయితే తాజా గా మంచు విష్ణు గరికపాటి- చిరంజీవి ఎపిసోడ్ పై చేసిన వ్యాఖ్యలు చిరంజీవి ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచాయి. సినీ ఇండస్ట్రీ లో చిరంజీవి ఫ్యామిలీ కి మోహన్ బాబు ఫ్యామిలీ కి మధ్య కొంత గ్యాప్ ఉందని మొదటి నుంచి కొంత ప్రచారం ఉంది. అయితే ఇటీవల కొంతకాలం చిరంజీవి- మోహన్ బాబు ఎంతో సఖ్యత తో మెలిగినట్లు కనిపించి నా మూవీ ఆర్ట్స్ అసో సియేషన్ ఎన్నికల సందర్భం గా వాళ్ళిద్దరి మధ్య మళ్లీ విభేదాలు తలెత్తా యన్న ప్రచారం ఉంది. మంచు విష్ణు కూడా ఇటీవల కాలంలో చిరంజీవి పై పరోక్షంగా
విమర్శలు చేశాడు.

ఈ నేపథ్యం లో ఆయన చిరు గరిక పాటి వ్యవహారం పై కామెంట్స్ చేశాడు. 'అలయ్ బలయ్' కార్యక్రమం లో ఏం జరిగిందో నాకు పూర్తి గా తెలియదు. గరికపాటి గారు ఏదో అనడం, అందుకు చిరంజీవి ఫ్యాన్స్ స్పందిం చడం జరిగింది. కానీ చిరంజీవి గారు ఒక లెజెండ్. ఆయనతో ఫోటో తీసుకోవడం అనేది అభిమానులకు ఒక సువర్ణ అవకాశం. చిరంజీవి దగ్గరికి ఎవ రైనా పరిగెత్తుకు వెళ్లి ఫోటో తీసు కోవడం మామూలే.అభిమానుల ఉత్సాహాన్ని ఆపలేం. చిరు వంటి పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఎగ్జైట్మెంట్లో ఉంటారు' అని విష్ణు కామెంట్స్ చేశాడు. గరికపాటి ఎపిసోడ్ పై విష్ణు చేసిన కామెంట్స్ చిరంజీవి అభి మానులను ఆశ్చర్య పరుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: