ముఖ్యంగా ప్రభాస్ మద్దతు సంతోష్ శోభన్ కి బాగానే ఉందని చెప్పవచ్చు. వర్షం సినిమాతో తనకంటూ మంచి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ తనయుడు అవ్వడం వల్ల మరేదైనా కారణం కావచ్చు తెలియదు కానీ..సంతోష్ శోభన్ కెరియర్ విషయంలో మాత్రం ప్రభాస్ తన వంతు సహాయం చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కెరియర్ ప్రారంభం నుండి ప్రభాస్ మద్దతుతో ముందుకు సాగిపోతున్న సంతోష్ శోభన్ తాజాగా లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రభాస్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని ఎన్నోసార్లు తెలియజేశారు సంతోష్.
ఇక ఆయన్ని జీవితాంతం సరే అభిమానిస్తూ ఉంటానని తెలిపారు. ప్రభాస్ తన హోమ్ బ్యానర్ అయిన యువి క్రియేషన్ ద్వారా సంతోష్ శోభన్ తో సినిమాలు చేయించారు. కెరియర్ కష్టంలో ఉన్న సమయంలో ప్రభాస్ సహాయం చేయడం వల్ల సంతోష్ ఇలాంటి అభిమానం చూపిస్తున్నారని సమాచారం. ప్రభాస్ అంటే కేవలం సంతోష్ శోభన్ కి మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్టు-k, సలార్, ఆది పురుష్ వంటి చిత్రాల షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో అత్యధిక భారీ బడ్జెట్ పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు ప్రభాస్..