దళపతి విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రాన్ని ఇంత వరకు ద్విభాష చిత్రంగానూ, తెలుగు చిత్రంగానూ అనుకున్నారంతా.
కానీ తాజాగా వంశీ పైడిపల్లి అసలు విషయాన్ని చెప్పేశాడు. ఇది పక్కా తమిళ సినిమా అని కుండబద్దలు కొట్టేసినట్టు చెప్పేశాడు. అయితే ఇలా తమిళ సినిమానే అని చెప్పడంతో తెలుగు మార్కెట్ మీద దెబ్బ పడుతుందని వంశీ పైడిపల్లికి తెలియంది కాదు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నా.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నా కూడా విజయ్ నటిస్తుండటంతో.. తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది.

ఇది ఫ్యామిలీ స్టోరీ అయినప్పటికీ దళపతి విజయ్ నుంచి ఫ్యాన్స్ ఏం ఆశిస్తుంటారో అవన్నీ ఉంటాయని అంటున్నాడు. మొత్తానికి ఈ సినిమాను ఫ్యామిలీ అండ్ మాస్ కమర్షియల్ సినిమాగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వారిసు సినిమా తమిళ సినిమాయే అని ముందు నుంచి కూడా దిల్ రాజు హింట్ ఇస్తూనే వచ్చాడు. తెలుగు సినిమా షూటింగ్‌లన్నీ బంద్ చేయాలని అన్నప్పుడు.. దిల్ రాజు తన వారిసు సినిమాను మాత్రం ఆపలేదు.

అందరూ అడిగితే.. అది తెలుగు సినిమా కాదని అన్నాడు. అప్పుడంతా కూడా దిల్ రాజుని ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లి కూడా అదే విషయాన్ని చెప్పాడు. ఇది పక్కా తమిళ్ సినిమా అంటున్నాడు. కానీ ఈ సినిమా ప్రారంభం నాడు మాత్రం పాన్ ఇండియన్ లెవెల్లో చెప్పుకొచ్చారు. ద్విభాష చిత్రంగా ఇది రాబోతోందంటూ ఊదరగొట్టేశారు. కానీ ఇప్పుడు మాత్రం పక్కా తమిళ సినిమానే అని అంటున్నారు.

ప్రిన్స్ సినిమాను కూడా ద్విభాష చిత్రంగానే పరిగణించారు. కానీ సినిమా చూస్తే మాత్రం పక్కా తమిళ సినిమాగానే అనిపించింది. అయితే ఇప్నుడు వారిసు విషయంలోనూ అదే రిపీట్ కానుందనిపిస్తోంది.పోస్టర్లు రిలీజ్ చేసే సమయంలోనూ ముందుగా తమిళ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఆ తరువాత మెల్లిగా వారసుడు అని తెలుగులో ప్రకటించారు. మరి ఈ తమిళ సినిమాకు సంక్రాంతి రేసులో ఎన్ని థియేటర్లు ఇస్తారో చూడాలి. దీని రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

విజయ్ నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి తమన్ అదిరిపోయే సంగీతాన్ని సమకూరుస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా ఆల్బమ్ అదిరిపోయిందని ఇప్పటికే వంశీ పైడిపల్లి చెప్పేశాడు. ఫస్ట్ సింగిల్ దీపావళికి వస్తుందనే టాక్ వైరల్ అయింది. కానీ వారిసు ఫస్ట్ సింగిల్ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: