'ఉన్నది ఒక్కట్టే జీవితం.. నేను ఎవరి కోసం పుట్టలేదు.. నాకోసం ఎవరు పుట్టలేదు' అనే మోటీవ్ తో బతికే ఆర్జీవీ సమాజ నియమాలకు భిన్నం జీవిస్తున్నాడు అని చెప్పొచ్చు. మరోవైపు ఇండియన్ లాకు లోబడే రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. చట్టపరంగా తనకున్న స్వేచ్ఛను నూటికి నూరు శాతం వినియోగించుకుంటున్నారు.
ఇక సోషల్ మీడియాలోనూ నిత్యం బాగా యాక్టివ్ గా ఉంటారు రామ్ గోపాల్ వర్మ. సోషల్ ఇష్యూస్ పై స్పందించడంతో పాటు.. తన వ్యక్తిగత విషయాలను కూడా చాలా పంచుకుంటుంటాడు. పబ్స్, పార్టీల్లో అమ్మాయిలతో ఆర్జీవీ చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిరభ్యరంతంగా వీడియోలను కూడా షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన పంచుకున్న మరో వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది. హైదరాబాద్ లోని రిచ్ అరేంజ్ మెంట్స్ కలిగిన ప్రిస్మ్ క్లబ్ లో నిన్న రాత్రి రామ్ గోపాల్ వర్మ రచ్చరచ్చ చేశారు మరీ. హాలోవీన్ క్యాస్టూమ్స్ లో యువతతో కలిసి ఎంజాయ్ చేశారు. డీజే సాంగ్స్ ను ఎంజాయ్ చేస్తూ పార్టీ వైబ్ లో మునిగి తేలారు. పబ్ లో ఆర్జీవీ ఎంట్రీ ఇవ్వడంతో మరింత సందడి పెరిగింది అంటా. పబ్ లో అమ్మాయిలతో అదిరిపోయే స్టెప్పులేయడంతో పబ్ మొత్తంగా గోలగోలగా మారింది. ఈ క్రమంలో తీసిన వీడియోలను ట్విటర్ వేదికన పంచుకున్నారు ఆర్జీవీ. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు. కొందరు 'కింగ్ సైజ్ లైఫ్' అంటుంటే.. మరికొందరు మాత్రం దెప్పిపొడుస్తున్నారు.
సినిమాల విషయానికొస్తే.. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. కొద్దికాలంగా బర్నింగ్ ఇష్యూస్ పైనే ఎక్కువగా సినిమాలు తీస్తున్నారు. పొలిటికల్ అంశాలు, సమాజంలోని మార్పులను తన వ్యూ పాయింట్ లో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం 'వ్యూహం'శపథం' అనే రాజకీయల చిత్రాలను తెరకెక్కించబోతున్నారు. 'వంగవీటి'ప్రొడ్యూసరే ఈ సినిమాలకు నిర్మాత. మొదట వ్యూహం, ఆ తర్వాత శపథం చిత్రం రానుందని క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ చిత్ర నిర్మాణం కోసం రీసెంట్ గా ఏపీ సీఎం జగన్ కూడా కలిశారు. ప్రస్తుతం ఆర్జీవీ మళ్లీ హాట్ టాపిక్ గా మారారు అని చెప్పొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి