టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే  ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడు గా మంచి గుర్తింపు కలిగిన బాబి దర్శకత్వం వహిస్తూ ఉండగా , శృతి హాసన్మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉండగా , మాస్ మహారాజా రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. రవితేజ పాత్ర ఈ మూవీ కే హైలెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే రవితేజ ఈ మూవీలో  40 నుండి 45 నిమిషాల నిడివి గల పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి టైటిల్ టీజర్ ను విడుదల చేసింది. ఈ టైటిల్ టీజర్ కు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత గా పెరిగిపోయాయి. ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ ను ఫుల్ స్పీడ్ లో చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ను కూడా మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: