బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజీ సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి కీయరా అద్వానీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ హిందీ తో పాటు తెలుగు లో కూడా పలు మూవీ లలో నటించింది. తెలుగు లో ఈ ముద్దు గుమ్మ మహేష్ బాబు హీరో గా తెరకెక్కిన భరత్ అనే నేను , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా లలో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకుంది.

ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం లో దిల్ రాజు బ్యానర్ లో తేరకక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కియారా అద్వానీ , టాబు గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజా ఇంటర్వ్యూ లో కియారా అద్వానీ  ని యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ.. ‘ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో గోల్డెన్ గర్ల్ ఎవరని అడిగాడు.

దానితో కియారా అద్వానీ టక్కున టబు అని చెప్పేసింది. ఈ మధ్య కాలంలో టాబు నటించిన బుల్ బుల్లయ్య 2 మరియు దృశ్యం 2 మూవీ లు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. వాటితో టబు స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. అలాగే టబు అంటే తనకు ఎంతో అభిమానం అని కియారా అద్వానీ చెప్పుకొచ్చింది. మరియు టబు బాలీవుడ్ ఇండస్ట్రీ లో గోల్డెన్ గర్ల్ అని కియారా అద్వానీ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: