తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్  కేస్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా , మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్ గా నటించింది. నాచురల్ స్టార్ నానిమూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం తాజాగా ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి హిట్ ది సెకండ్ కేస్ మూవీ కి "ఏ" సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. 

హిట్ ది సెకండ్ కేస్ మూవీ ని 2 గంటల నెడివితో ప్రేక్షకుల ముందుకు మూవీ యూనిట్ తీసుకురానుంది. ఇలా చాలా తక్కువ రన్ టైమ్ తో హిట్ ది సెకండ్ కేస్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ అద్భుతమైన విజయం సాధించడం , హిట్ ది సెకండ్ కేస్ మూవీ హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కడం తో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. మరి హిట్టు ది సెకండ్ కేస్ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ రేంజ్ లో అందుకుంటుందో తెలియాలి అంటే డిసెంబర్ 2 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: