తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి శైలేష్ కొలను గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు విశ్వక్ సేన్ హీరో గా తెరకెక్కిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ తో దర్శకుడు గా కెరియర్ ను మొదలు పెట్టాడు. మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకొని మంచి గుర్తింపు ను శైలేష్ కొలను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తగ్గించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా శైలేష్ కొలను హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. అడవి శేషు మూవీ లో హీరో గా నటించగా మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్ గా నటించింది.

నాని ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుండి చిత్ర బృందం ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికుల మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్లు ఇచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని చూసిన సెన్సార్ సభ్యులు షాక్ అయినట్లు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం ఈ మూవీ లో సీరియల్ కిల్లర్ గురించి రివిల్ చేసే సన్నివేశం చాలా థ్రిల్లింగ్ గా ఉండడంతో సెన్సార్ బోర్డ్ సభ్యులు షాక్ కు గురి అయినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: