బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ తాజాగా స్వాతి ముత్యం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. స్వాతి ముత్యం మూవీ లో బెల్లంకొండ గణేష్ తరసన వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. స్వాతి ముత్యం మూవీ మంచి అంచనాల నడుమ దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి మంచి టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభించింది. దానితో ఈ మూవీ కి డీసెంట్ కలెక్షన్ లు లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కొంత కాలం క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బెల్లంకొండ గణేష్ "నేను స్టూడెంట్ సార్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తూ ఉండగా , అవంతిక దాసాని ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. 

ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై పర్వాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా నేను స్టూడెంట్ సార్ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా లోని సాంగ్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ లో మాయే మాయే అనే సాంగ్ ను డిసెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: