అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు మరియు తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం ఈ రెండు ఇండస్ట్రీ లలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. కీర్తి సురేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి నేను శైలజ మూవీ తో ఎంట్రీ ఇచ్చి , ఆ తర్వాత అనేక తెలుగు మూవీ లలో హీరోయిన్ గా మరియు ఇతర పాత్రల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఈ సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తాజాగా కీర్తి సురేష్ కొత్త మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో కీర్తి సురేష్ నటించబోతుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టైటిల్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ కి చిత్ర బృందం రఘు తాత అనే టైటిల్ ను ఖరారు చేసింది. ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ గా రూపొందబోతుంది. ఈ మూవీ సుమన్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ యూనిట్ కీర్తి సురేష్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయగా , ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కీర్తి సురేష్ అద్భుతంగా ఉండడంతో , ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో కీర్తి సురేష్ పోరాట యోధురాలి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: