దాదాపు దశాబ్ద కాలం నుంచి తెలుగు బుల్లితెరపై  టాప్ కామెడీ షో గా కొనసాగుతున్న జబర్దస్త్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి జబర్దస్త్ కార్యక్రమంలో ఎవరు ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. జబర్దస్త్ లో అనసూయ వెళ్ళిపోయిన తర్వాత కొత్త యాంకర్ వస్తుందనుకుంటే ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ గా ఉన్న రష్మీ జబర్దస్త్ లో కూడా ప్రత్యక్షమైంది.


 దీంతో ఇక రెండు షోలకి కూడా రశ్మిని యాంకర్ గా కొనసాగిస్తారు అని అందరూ ఫిక్స్ అయిపోయిన సమయంలో కొత్త యాంకర్ ఎంట్రీ ఇచ్చింది. బుల్లితెర నటి అయిన సౌమ్యా రావు కొత్త యాంకర్ గా రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు అని చెప్పాలి. ఇక అంతకు ముందు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా సౌమ్యరావు బాగా హైలైట్ అయింది అని చెప్పాలి. దీంతో రశ్మిని కావాలనే తొలగించారు అన్న ప్రచారం కూడా మొదలైంది అని చెప్పాలి.  ఈ విషయంపై ఇప్పటివరకు సౌమ్య రావు గాని పాత యాంకర్ రష్మి గాని స్పందించలేదు.


 కానీ ఇటీవల సౌమ్యా రావు, రష్మి గౌతమ్ ఏకంగా స్టేజ్ మీదే యాంకరింగ్ కోసం గొడవపడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో భాగంగా రష్మీ యాంకరింగ్ చేస్తుండగా సౌమ్య రావు కూడా షోలోకి వచ్చింది. ఇక సౌమ్యరావు రాగానే రష్మీ ఆమెకు కౌంటర్ వేసింది. కొత్త యాంకర్ రాగానే పక్కకు తప్పుకోవడానికి నేనేమైనా జబర్దస్త్ వదిలి వెళ్ళిపోయిన పాత ముగ్గురు యాంకర్స్ అనుకుంటున్నావా అంటూ రష్మి కౌంటర్ వేసింది. ముగ్గురు కాదు నలుగురు అంటూ రష్మీకి సౌమ్యరావు గట్టి కౌంటర్ ఇచ్చింది.


 ముగ్గురు యాంకర్స్ అంటే గతంలో సమీరా, వర్షిని, అనసూయ ముందుగా ఇక రష్మీ ని కూడా సౌమ్య రావు అందులో కలిపేస్తుంది. దీంతో నువ్వు గొప్ప నేను గొప్ప అనే పోటీ వీరిద్దరి మధ్య ఏర్పడింది. కల్పించుకున్న ఇంద్రజ మీ ఇద్దరిలో ఎవరు బెస్ట్ తెలియాలంటే ఎక్ ట్రా జబర్దస్త్ టీం తరఫు నుంచి రష్మీ జబర్దస్త్ నుంచి సౌమ్యరావు తమ టాలెంట్ను ప్రూవ్ చేసుకోవాలి. ఎవరు నెగ్గితే వాళ్లే గొప్ప అంటూ ఒక టాస్క్ ఇస్తుంది. ఈ ప్రోమో ఇటీవల విడుదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: