తమిళ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో అజిత్ ఒకరు. తెలుగు లో కూడా ఈ హీరో కి ఎలాంటి స్థాయి లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా ఇప్పుడు ఈ హీరో తూనీవు అనే సినిమా తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సంక్రాంతికి ఈ సినిమా రాబోతుండగా తమిళం లో విజయ్ వర్సెస్ అజిత్ ఫ్యాన్స్ మధ్యలో ఫైట్ అయితే ఒక రేంజ్ లో కొనసాగుతోంది అని చెప్పవచ్చు. . ఇక వీరి సినిమాలు కూడా సంక్రాంతికి పోటీ పడుతూ ఉండడంతో సౌత్ ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.

వారసుడు తునివు ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా అత్యధిక కలెక్షన్స్ అందుకుంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఇవి తెలుగు లోకూడా విడుదల అవుతుండగా ఇక్కడ కూడా భారీ స్థాయి లో పోటీ ఏర్పడింది. ముఖ్యంగా అజిత్ అయితే ప్రతిసారి తన ప్రతి సినిమాతో ఈజీగా 100 కోట్ల మార్కెట్ అయితే అందుకుంటూ ఉన్నాడు. ఇక ఈసారి కూడా తునివు సినిమాతో అదే తరహాలో సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన బజ్ అయితే అంత ఎక్కువగా కనిపించడం లేదు.

విజయ్ మళ్ళీ ఎప్పటిలానే వారసుడు సినిమాతో కొంత హైప్ ఎక్కువగా క్రియేట్ చేస్తున్నాడు. ఇక తెలుగులో కూడా అజిత్ తునివు సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. తెలుగులో ఎలాంటి టైటిల్ సెట్ చేసారు అని వివరాల్లోకి వెళితే కొద్దిసేపటికి క్రితమే అధికారికంగా తెలుగు టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.  తెలుగు లో ఈ సినిమా తెగింపు అనే పేరుతో విడుదల కాబోతుండగా ఈ పోస్టర్ అందరిని ఎంతో ఆకట్టుకుంటుంది. మరి వరుస సినిమా లతో తెలుగు లో మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్న ఈ హీరోసినిమా తో ప్రేక్షకులను ఏ స్థాయి లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: