ఫేమస్ తెలుగు ఓటీటీ సంస్థ షో ఆహాలో నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తోన్న అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫస్ట్ సీజన్లో  భారీ విజయం అందుకున్న ఈ షో.. బాప్ ఆఫ్ ఆల్ షోస్ గా దూసుకుపోతుంది. ఈ షోకి ఎక్కువగా స్టార్ హీరోస్ రావడంతో పాపులారిటి విపరీతంగా పెరిగిపోతుంది.ఇక ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా చాలా సక్సెస్ ఫుల్‏గా నిలిచింది. గత సీజన్ కంటే కూడా భిన్నంగా.. రెండో పార్ట్ లో సెలబ్రెటీలతోపాటు ఇంకా రాజకీయ ప్రముఖులు కూడా వచ్చేశారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఇటీవల తన స్నేహితుడితో కలిసి బాగా సందడి చేశారు. ప్రభాస్ ఎపిసోడ్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎంతగానో ఎదురుచూస్తున్న ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్. 


ఇటీవలే ఆయన ఈ షోకు హాజరు కాగా .. ఇప్పటికే విడుదలైన టీజర్స్ అయితే సోషల్ మీడియాలో పెద్ద సంచలనాన్ని సృష్టించాయి. ఇప్పటి దాకా ఏ టాక్ షోకు వెళ్లని పవన్ కళ్యాణ్ మొదటి సారి బాలయ్యతో కలిసి టాక్ షోలో పాల్గోనడంతో ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని కూడా రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా విడుదలైన ప్రోమో అయితే అదిరిపోయిందనే చెప్పాలి. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ తోపాటు సాయి ధరమ్ తేజ్ కాసేపు సందడి చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి కూడా బాలయ్య ఆరా తీశారు. ఇంత మానసిక సంఘర్షణకు గురైన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ ఎలా అయ్యారు అంటూ ప్రశ్నించారు బాల కృష్ణ. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్, బాల కృష్ణ మధ్య ఆసక్తికర ప్రశ్నలు ఇంకా అలాగే సమాధానాలు కూడా నడిచినట్లుగా తెలుస్తోంది.ఇక చూడాలి ఫుల్ ఎపిసోడ్ ఇంకెన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: