టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా నటించిన చిత్రం మైఖేల్.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 2023 ఫిబ్రవరి 3 వ తేదీన సినిమాను థియేటర్లలో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ , థ్రిల్లర్ ప్రమోషన్లతో సంచలనం సృష్టించబోతోంది ఈ సినిమా. ఇప్పుడు తాజాగా అందుతున్న వార్త ఏమిటంటే.. జనవరి 31వ తేదీన అంటే మంగళవారం హైదరాబాదులోని జేఆర్సి కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని మేకర్స్ కూడా ప్లాన్ చేశారు.

జనవరి 31వ తేదీన మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి మైకేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం జరగనుంది.  ప్రస్తుతం ఈవెంట్ ముఖ్యఅతిథి గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఎవరు వస్తారు అనే విషయం ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. మరొకవైపు ఈ సినిమాలో విజయ్ సేతుపతి,  గౌతమ్ వాసుదేవ్ మీనన్,  వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్ తదితరులు హీరోలు కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు కరణ్ సీ. ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా సిఎస్ సామ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.


మొత్తానికైతే సందీప్ కిషన్ ఈ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టడానికి .. థ్రిల్ ఫీల్ చేయడానికి ప్రయత్నాలు చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన కథలను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఒక్క సినిమాతో కూడా సరైన సూపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. దీంతో యావరేజ్ హీరోగా మిగిలిన ఈయన ఈసారి మైఖేల్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మరి ఈ సినిమా సందీప్ కిషన్ కి ఏ విధమైనటువంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: