నాచురల్ స్టార్ నాని ఇటీవల అంటే సుందరానికి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పూర్తిస్థాయిలో డిజాస్టర్ గా మిగిలారు. ఇప్పుడు దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మార్చి 30వ తేదీన థియేటర్లలో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం రెడీ అవుతోంది. ఒక పక్క నాని తన 30వ చిత్రాన్ని మొదలుపెట్టేశారు. ఇందులో సీతారామం హీరోయిన్ సీత అలియాస్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

నాని 30 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను ఘనంగా ప్రారంభించారు.. నిన్న పూజా కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను లాంచనంగా లాంచ్ చేశారు. సినిమా పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు ..ముహూర్తం షాటుకు ఆయన క్లాప్ కొట్టగా .. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కెమెరా యొక్క స్విచ్ ఆన్ చేశారు.. అలాగే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టును మేకర్లకు అందజేయగా.. కిషోర్ తిరుమల, బుచ్చిబాబు,  హను రాగవపూడి , వివేక ఆత్రేయ,  వశిష్ట తొలిసారిగా గౌరవ దర్శకత్వం వహించడం జరిగింది.  ముఖ్యంగా ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరవడం గమనార్హం.

ఇక ఈరోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ప్రారంభం కానుంది.. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అప్డేట్ ను కూడా వీడియో రూపంలో చిత్ర మేకర్స్ విడుదల చేయగా వీడియో పై భారీ రెస్పాన్స్ లభిస్తోంది.  ఒక వైవిధ్యమైన కథతో రానున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా తండ్రి - కూతుర్ల మధ్య జరిగే బాండింగ్ ఇందులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది నూతన దర్శకుడు శౌర్యుమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. మంచి ఫీల్ గుడ్ మూవీ అని తెలుస్తోంది. ఒకవైపు దసరా సినిమా..  మరొకవైపు 30 మూవీతో నాని ఎలాంటి క్రేజ్ సంపాదించుకుంటారో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: