టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యంగ్ హీరోలలో ఒకరు అయినటువంటి కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో హీరోగా నటించి అందులో కొన్ని సినిమాలతో మంచి విజయాలను అందుకుని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు గల హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. 

ఇలా టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు గల హీరోలలో ఒకరిగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న కిరణ్ తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాలో హీరో గా నటించాడు. మురళీ కిషోర్ అబ్బోరు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఫిబ్రవరి 17 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి ఇప్పటికే చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను ... మరియు కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. 

తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని మరియు సమయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను ఫిబ్రవరి 7 వ తేదీన ఉదయం 11 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. మరి ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా ట్రైలర్ పై కూడా ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: