‘ఆచార్య’ ఘోరమైన ఫ్లాప్ తో చిరంజీవి స్టామినా అయిపోయింది అని విమర్శలు చేసిన వారికి ‘వాల్తేర్ వీరయ్య’ బ్లాక్ బష్టర్ హిట్ తో చిరంజీవి గట్టి సమాధానం ఇచ్చాడు. ఈమూవీకి 140 కోట్ల నెట్ కలక్షన్స్ రావడంతో ఒకానొక దశలో ‘అల వైకుంఠ పురములో’ మూవీ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుంది అని భావించినప్పటికీ ‘వాల్తేర్ వీరయ్య’ మూవీ మూడవ వారం ఎంటర్ అయిన దగ్గర నుండి ఆమూవీ కలక్షన్స్ భారీగా పడిపోవడంతో బన్నీ రికార్డులను చిరంజీవి బ్రేక్ చేయలేకపోయాడు.


‘వాల్తేర్ వీరయ్య’ హడావిడి ముగిసి పోవడంతో ఈ సంవత్సరం దసరా రేస్ కు రాబోతున్న ‘భోళా శంకర్’ మూవీ కూడా వీరయ్య స్థాయిలో రోకార్డులు క్రియేట్ చేస్తుందా అన్న అంశం పై ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. అయితే ‘వాల్తేర్ వీరయ్య’ కు కలిసివచ్చిన అంశాలు ‘భోళా శంకర్’ కు కలిసిరావు అన్న కామెంట్స్ కొందరు చేస్తున్నారు.


దీనికికారణం వీరయ్య మూవీ సంక్రాంతికి విడుదల కావడంతో పాటు ఆమూవీ బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ మూవీతో పోటీగా విడుదల కావడంతో మెగా అభిమానులు బాలయ్య ముందు చిరంజీవి ఏమాత్రం తగ్గ కూడదు అన్న పట్టుదలతో గట్టిగా ప్రయత్నించడంతో ‘వాల్తేర్ వీరయ్య’ మూవీకి ఆ రేంజ్ లో కలక్షన్స్ వచ్చాయని అయితే అదే మామూలు రోజులలో ఎటువంటి పోటీ లేకుండా ఈసినిమా వచ్చి ఉంటే ఆస్థాయి కలక్షన్స్ ఈమూవీకి వచ్చి ఉండేవి కాదు అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.


ఇక ‘భోళా శంకర్’ విషయానికి వస్తే తమిళ సినిమా ‘వేదాళం’ రీమేక్ గా నిర్మింపబడుతున్న ఈమూవీని ఇప్పటికే అనేకసార్లు జనం ఓటీటీ లో చూసిన పరిస్థితులలో కొత్తగా ‘భోళా శంకర్’ పై పెద్దగా ఆశక్తి ఉండకపోవచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈమూవీకి ఫెయిల్యూర్ దర్శకుడుగా స్టాంప్ వేయించుకున్న మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉండటంతో అతడి నుండి ఈసినిమాకు సంబంధించి పెద్దగా మ్యాజిక్ ఉండకపోవచ్చు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..
మరింత సమాచారం తెలుసుకోండి: