టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో చిన్న బడ్జెట్ సినిమాగా తెరకెక్కి ఈమధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రైటర్ పద్మభూషణ్ సినిమాకు ఒక రేంజిలో పాజిటివ్ రెస్పాన్స్ దక్కిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకి మంచి రివ్యూలు కూడా రావడంతో పాటు ప్రేక్షకులు కూడా మంచి పాజిటివ్ మౌత్ టాక్ ను ప్రచారం చేయడం జరిగింది.రైటర్ పద్మభూషణ్ సినిమా కి ఇప్పటికే మంచి కలెక్షన్స్ నమోదు అవుతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఈ సమయంలో టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో మరింతగా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబు 'రైటర్ పద్మభూషన్' సినిమా గురించి స్పందించాడు.సినిమా చూసిన తర్వాత మూవీ యూనిట్ సభ్యులతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో  షేర్ చేసిన మహేష్ బాబు... 'రైటర్ పద్మభూషణ్' సినిమాను చూసి చాలా ఆనందించాను. చాలా మంచి చిత్రం.. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే బాగుంది.


ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ చిత్రం. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతగానో నచ్చే చిత్రం. సినిమాలో సుహాస్ నటన చాలా బాగుంది.. ఇతర నటీ నటులు ఇంకా సాంకేతిక నిపుణులకు నా శుభాకాంక్షలు అంటూ మహేష్ బాబు స్పందించాడు. మహేష్ బాబు స్పందనకి సుహాస్ ఎమోషనల్ అయ్యి తాను కూడా ఓ పోస్ట్ పెట్టాడు.మహేష్ గారు సినిమా పట్ల రియాక్ట్ అయిన తీరు చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయట సుహాస్ కి. అందుకే మహేష్ తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు సుహాస్. సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు సినిమా నచ్చిందంటే చిన్న హీరో పెద్ద హీరో అని చూడరు. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు. ఇది మహేష్ బాబులో ఉన్న గొప్ప లక్షణం. బహుశా తండ్రి నుంచి వచ్చిన గొప్ప గుణం కాబోలు.. మా బాబు బంగారం అంటూ మహేష్ ఫ్యాన్స్ మహేష్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: