బుల్లితెరపై పటాస్ కార్యక్రమం తో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు కమెడియన్ యాదమ్మ రాజు. యాదమ్మ రాజు తోపాటు పటాస్ షో తో చాలామంది కమెడియన్స్ కి మంచి గుర్తింపు లభించింది. గతంలో జీ తెలుగులో ఒక కార్యక్రమంలో కనిపించిన యాదమ్మ రాజు దాని అనంతరం స్టార్ మా లో కొన్ని కార్యక్రమాలలో కనిపించారు. ప్రస్తుతం యాదమ్మ రాజు జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇతర షోలలో సందడి చేస్తూ కనిపిస్తున్నాడు. జబర్దస్త్ లో ప్రస్తుతం టీం లీడర్ గా వ్యవహరిస్తున్నాడు యాదమ్మ రాజు. ఇటీవల తన ప్రియురాలు స్టెల్లా ని  కూడా వివాహం చేసుకోవడం జరిగింది.

ఇక వారిద్దరి వివాహానికి మెగా బ్రదర్ నాగబాబు తో పాటు పలువురు ప్రముఖులు కూడా రావడం జరిగింది. ఆరు సంవత్సరాల ప్రేమ తర్వాత ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ తమ వివాహ బంధం మరియు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా విషయాలను తమ యూట్యూబ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు వీరిద్దరూ. ఇదిలా ఉంటే వీరికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.అదేంటి అంటే పెళ్లయి కొన్ని వారాలు కూడా గడవకముందే వీరిద్దరూ విడిపోయారని తెలుస్తోంది. విడిపోయారు అంటే గొడవపడి విడిపోయారని కాదు.

 ఉన్నత చదువుల కోసం యాదమ్మ రాజు భార్య స్టెల్లా విదేశాలకు వెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఆమె అక్కడ ఉన్నత చదువులను చదువుతున్నట్లుగా సమాచారం. అంతే కాదు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏడాది తిరిగేలోగా మళ్లీ ఇండియాకు స్టెల్లా తిరిగి వచ్చేస్తుందని తెలుస్తోంది. పెళ్లయిన వెంటనే భార్యకు దూరంగా ఉండాలి అంటే కష్టమైన పనే.కానీ యాదమ్మ రాజు మాత్రం తన భార్య భవిష్యత్తు గురించి ఆలోచించి ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపి ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో ఈ వార్త విన్న చాలామంది పెళ్లయినా కొన్ని వారాలకి వీరిద్దరు విడిపోయారు అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలను వైరల్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: