మొన్నటి వరకు కమర్షియల్ సినిమాలతోనే ప్రేక్షకులను పలకరించిన కళ్యాణ్ రామ్ సరైన విజయాలను అందుకోలేకపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్ని సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చినా హిట్టు కొట్టలేక సతమతమైపోయాడు. ఇలాంటి సమయంలో విభిన్నమైన కాన్సెప్ట్ తో బింభిసార అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ బింబిసారా సూపర్ హిట్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసాడు.


 కమర్షియల్ సినిమాలు కాదు కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న విషయాన్ని అర్థం చేసుకున్న కళ్యాణ్ రామ్ ఇక కథలు ఎంపికలో ఆచీ తూచి అడుగులు వేస్తున్నాడు అని చెప్పాలి. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ప్రేక్షకులు చూడని కొత్త కథలను ఎంచుకుంటూ సర్ ప్రైస్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ ఇటీవలే ఒక సరి కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఏకంగా త్రిపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు అని చెప్పాలి.


 మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా అమీగోస్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన ఎంతో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో ఎంతో బిజీ బిజీగా గడుపుతూ ఉంది. ఇప్పటికే అమీగోస్ సినిమాకు సంబంధించి టీజర్ సాంగ్స్ కూడా విడుదల అయ్యి మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. అయితే ఇక ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది అని చెప్పాలి. అయితే ఇక కళ్యాణ్రామ్ సినిమా టైటిల్ అమిగోస్ అసలు అర్థం ఏంటి అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. కళ్యాణ్ రామ్  ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అమిగోస్ అనేది స్పానిష్ పదం. ఒక స్నేహితుడిని సూచించడానికి లేదా రిఫర్ చేయడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు అంటూ చెప్పుకొచ్చాడు కళ్యాణ్ రామ్.

మరింత సమాచారం తెలుసుకోండి: