కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి పోయిన సంవత్సరం కాంతారా అనే మూవీ విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. కాంతారా మూవీ మొదట కన్నడ భాషలో విడుదలయి సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత ఈ మూవీ ని మరి కొన్ని భాషల్లో విడుదల చేశారు. అందులో భాగంగా ఈ సినిమాను తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ టాక్ ను తెచ్చుకొని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ ను అందుకుంది.

ఇది ఇలా ఉంటే ఈ సూపర్ సక్సెస్ మూవీ లో రిషబ్ శెట్టి హీరో గా నటించగా ... సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో రిషబ్ శెట్టి హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లో మరో రెండు భాషల్లో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లో స్పానిష్ మరియు ఇటాలియన్ విదేశీ భాషల్లో అయితే థియేట్రికల్ గా రిలీజ్ చేయబోతున్నట్టుగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ మూవీ ని  హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: