హీరో నాని మంచి నటుడు అంతకు మించి వివాదాలకు దూరంగా ఉంటూ ఉంటాడు. అయితే గత కొన్ని రోజులుగా ‘దసరా’ మూవీ ప్రమోషన్ లో అతడు చేస్తున్న కామెంట్స్ అతడి మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తున్నాయి అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈమధ్య లేటెస్ట్ గా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని సుకుమార్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన కామెంట్స్ సుకుమార్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.సాధారణంగా ఒక హీరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నప్పుడు బాగా సెటిల్ అయిన దర్శకుడుతో మూవీని చేస్తారు కదా అలాంటిది ఒక కొత్త దర్శకుడుతో భారీ మూవీని ఏధైర్యంతో చేస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు నాని ఒక విచిత్రమైన జవాబు ఇచ్చాడు. ‘పుష్ప’ మూవీ తీస్తున్నప్పుడు సుకుమార్ కు ఒక్క తెలుగులో తప్ప మరెక్కడా మిగతా భాషల ప్రేక్షకులతో పరిచయం లేదని అయినప్పటికీ సుకుమార్ ‘పుష్ప’ మూవీని పాన్ ఇండియా మూవీగా తీసి బ్లాక్ బష్టర్ హిట్ కొట్టినట్లుగా యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ కు కూడ మిగతా భాషల ప్రేక్షకులతో పరిచయం లేకపోయినా ఆఖరికి తెలుగు ప్రేక్షకులతో పరిచయం లేకపోయినా సూపర్ హిట్ కొడతాడు అన్న నమ్మకంతో తాను ‘దసరా’ ను చేస్తున్నాను అంటూ కామెంట్స్ చేసాడు.


ఇప్పుడు ఈకామెంట్స్ సుకుమార్ అభిమానుల దృష్టి వరకు వెళ్ళడంతో వారంతా నానీని టార్గెట్ చేస్తూ ‘దసరా’ పై అంత మితిమీరిన ఆత్మవిస్వసమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ‘శ్యాంగ్ సింగ్ రాయ్’ విడుదల సమయంలో ఇలాంటి కామెంట్స్ చేసాడు. సినిమాలకు వచ్చే కలక్షన్స్ కంటే కిరాణా కొట్టు బిజినెస్ బాగుండి అంటు అప్పట్లో నాని చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.


ఏది ఏమైనా నాని ‘దసరా’ మూవీ పై పెట్టుకున్న ఆత్మవిశ్వాసం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి ఈనెలాఖరుకు రాబోతున్న ‘దసరా’ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: