రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... జగపతి బాబు ... పృథ్విరాజ్ సుకుమరన్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం ప్రభాస్ ... శృతి హాసన్ ... జగపతి బాబు ... పృధ్వీరాజ్ సుకుమరన్ లకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను విడుదల చేసింది.

వీటికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న ప్రభాస్మూవీ లో హీరో గా నటిస్తూ ఉండడం ... కే జి ఎఫ్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన మూవీ కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ లెవెల్లో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా భారీ లెవెల్ లో అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం చూసినట్లు అయితే సలార్ మూవీ కి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 200 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పోస్టర్ లను మినహాయిస్తే ఎలాంటి ప్రచార చిత్రాలను విడుదల చేయకుండానే ఈ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది అంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఏ రేంజ్ అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పవచ్చు. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్ లను ఈ చిత్ర బృందం మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: