నాచురల్ స్టార్ నాని కొంత కాలం క్రితం అంటే సుందరానికి అనే మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ రిజల్ట్ దక్కినప్పటికీ ఈ మూవీ లో నాని నటనకు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే నాని తాజాగా దసరా అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ తో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో నాని కి జోడిగా నటించింది. ఈ మూవీ మార్చి 30 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం అనేక పోస్టర్ లను ... కొన్ని పాటలను ... టీజర్ ... ట్రైలర్ లను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ముఖ్యంగా ఈ మూవీ లోని చంకీల అనే సాంగ్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యొక్క బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తాజాగా ఈ మూవీ కి సంబంధించిన బుకింగ్ లు ఓపెన్ అయ్యాయి. ఇదే విషయాన్ని ఈ మూవీ బృందం కూడా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఆన్లైన్ టికెట్ లకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఈ మూవీ మొదటి రోజు ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: