సూపర్ స్టార్ మహేష్ బాబు పోయిన సంవత్సరం సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. సర్కారు వారి పాట మూవీ తర్వాత తదుపరి మూవీ ని స్టార్ట్ చేయడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్న మహేష్ కొంత కాలం క్రితమే తన తదుపరి మూవీ ని ప్రారంభించాడు. మహేష్ తన తదుపరి మూవీ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ చిత్రానికి ఇప్పటివరకు ఈ సినిమా బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క చిత్రీకరణను "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో నిర్వహిస్తోంది.

మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల మహేష్ సరసన హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. కాకపోతే ఈ సినిమా ఆగస్టు 11 వ తేదీన విడుదల కావడం కష్టమే అని ... ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి రేసులో నిలిచే అవకాశం ఉంది అని అనేక వార్తలు వచ్చాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో కూడా సిగరెట్ తాగుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: