తెలుగు సినిమా పాటకు చిరునామాగా ఒక వెలుగువెలిగిన శ్రీశ్రీ నారాయనరెడ్డి కృష్ణశాస్త్రి లను నుంచి సిరివెన్నెల వరకు ఎవరికీ పట్టని అదృష్టం చంద్రబోస్ కు దక్కింది. ఆయన రాసిన ‘నాటు నాటు’ పాట అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఆస్కార్ అవార్డ్ ను సొంతం చేసుకున్నప్పటికీ ‘ఎదిగిన కొద్ది ఒదిగి ఉండమని’ ఆయన రాసిన మాటలను నిజం చేస్తూ తనకు కెరియర్ తొలిరోజులలో అవకాశాలు ఇచ్చిన కొందరు ప్రముఖులను వ్యక్తిగతంగా కలిసి కృతజ్ఞతలు తెలపడం అతడి సంస్కారానికి నిదర్శనం అంటూ ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి.  



ఆస్కార్ తో హైదరాబాద్ లో అడుగుపెట్టిన చంద్రబోస్ కు ఘనస్వాగతం లభించింది. వెనువెంటనే చంద్రబోస్ తన ఆస్కార్ అవార్డ్ ను చేత పట్టుకుని రామానాయుడు స్టుడియోస్ కు వెళ్ళి అక్కడ సురేష్ బాబును కలిసి తనకు 28 ఏళ్ల క్రితం ‘తాజమహల్’ మూవీలో పాటలు వ్రాసే అవకాశాన్ని ఇచ్చిన రామానాయుడు ను గుర్తుకు చేసుకుంటూ తన కృతజ్ఞతలను తెలియచేసాడు.


ఆతరువాత తనకు పాటలు రచయితగా గుర్తింపు కలగడానికి ఎంతో సహకరించిన రాఘవేంద్రరావు ఇంటికి వెళ్ళి ఆయనకు కూడ కృతజ్ఞతలు తెలియచేసి తన సంస్కారాన్ని చాటుకున్నాడు. తనను కన్నకొడుకుగా భావిస్తూ తనను ప్రోత్సహించిన రాఘవేంద్రరావు గురించి మాట్లాడుతూ ప్రశంసలతో అలనాటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. ఇలా తన కెరియర్ ప్రారంభంలో తనకు అవకాశాలు ఇచ్చిన వారందరిని కలుస్తూ చంద్రబోస్ పలకరించడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.


ఒక్క సినిమా హిట్ అయితే ఎవరైనా తమ మూలాలు మరిచిపోతున్న ఈరోజులలో చంద్రబోస్ తన ప్రారంభదశను మరిచిపోకుండా అలనాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకోవడం అతడి సంస్కారానికి నిదర్శనం అంటూ ప్రశంసలు వస్తున్నాయి.



సిరివెన్నెల మరణం తరువాత ఆయన స్థానాన్ని చేరుకోగల రచయిత ఎవరు అని చాలామంది సందేహిస్తున్న పరిస్థితులలో అనుకోకుండా తనకు వచ్చిన ‘ఆస్కార్’ అవార్డుతో చంద్రబోస్ సిరివెన్నెల స్థానాన్ని ఆక్రమించి తెలుగు పాటకు ప్రాణంపోసాడు అని అనుకోవడంలో ఎటువంటి సందేహంలేదు..



మరింత సమాచారం తెలుసుకోండి: