తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీ లలో దేశముదురు మూవీ ఒకటి. ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా ... అందాల ముద్దు గుమ్మ హన్సికమూవీ లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించింది.

చక్రి ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను సాధించడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లో కూడా బ్లాక్ బస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరి పోయింది. ఇలా అల్లు అర్జున్ కెరీర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ మూవీ ని మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సంవత్సరం అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ని ఏప్రిల్ 6 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున రీ రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్ లను అందుకున్నాయి. మరి అల్లు అర్జున్ హీరోగా హన్సిక హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన దేశముదురు మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ మూవీ రీ రిలీజ్ గురించి అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: