
మహేష్ బాబు కొత్త ఫోటోలను నమ్రత రెగ్యులర్ గా అభిమానుల ముందుకు తీసుకువస్తూ ఉంటుంది.సూట్ లుక్ లో ఉన్న స్టైలిష్ ఫోటోలను నమ్రత సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.ఆకట్టుకునే లుక్ తో పాటు మహేష్ బాబు చాలా స్టైలిష్ గా అవుట్ ఫిట్ తో కనిపిస్తున్నట్టు ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ మహేష్ బాబు మరింత అందంగా కనపడుతున్నారని ఈ ఫోటోలను చూస్తే మనకు అర్థమ వుతోంది.ఇక మహేష్ బాబు అభిమానులు అయితే ఈ ఫోటోలను సెకండ్లలో వైరల్ గా చేస్తున్నారు.
మహేష్ బాబు చిత్రాల విషయానికి వస్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే రాజమౌళి దర్శకత్వం లో తన తదుపరిచిత్రం ఉండబోతోంది అంటూ ప్రకటించారు. ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించడం జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబుకు సంబంధించి ఈ ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారుతున్నాయి. మహేష్ బాబు ఒక్క చిత్రానికి 60 నుంచి 80 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.