అక్కినేని హీరో అఖిల్ ప్రధాన పాత్రలో  నటించిన ఏజెంట్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం అఖిల్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ  సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. అయితే ఈ సినిమాపై భార్య రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయ్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి ప్రేక్షకు ఆదరణ లభించింది. అయితే మొదటి నుంచి కేవలం లవ్ స్టోరీల పైనే దృష్టి పెట్టిన అక్కినేని హీరో అఖిల్ ఇక ఇప్పుడు మొదటిసారి యాక్షన్ త్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.



 గతంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో హిట్టు సొంతం చేసుకున్న అఖిల్.. ఇక ఇప్పుడు ఏజెంట్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి మాస్ హీరోగా మారాలని అనుకుంటున్నాడు. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్ తన కెరీర్ గురించి.. తన ఇష్టాఇష్టాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలంటే పిచ్చి. అందుకే రాజమౌళి సినిమాలను తెగ ఇష్టపడుతూ ఉంటా. అయితే యాక్షన్ సినిమాలపై ఇష్టం ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. ఆ జోనర్లో భారీ స్థాయిలో ఏదో ఒకటి చేయాలనిపించింది.


 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నప్పుడే ఏదో వెలితిగా అనిపించింది. అలాగని ఆ సినిమా ను తక్కువ చేయడం కాదు. ఆ కథ వరకు ఆ సినిమా బాగుంటుంది. ఆ సమయంలో ఆత్మ విమర్శ చేసుకున్నాను. ఎలాంటి జోనర్ యాక్షన్ చేస్తే బాగుంటుంది అని ఆలోచన ఉన్నప్పుడు సురేందర్ రెడ్డిని కలిసాను. యువతరం చాలా రకం కథలతో మెప్పిస్తున్నారు. ఇక అందరికీ నేను ఏంటో తెలిసే కథ చేయాలి అనుకున్నప్పుడు.. స్పై కథ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. అయితే ఈ సినిమా కోసం నా దేహాకృతి అనేది చాలా కీలకమైన అంశం. ఈ క్రమంలోనే ఆరు నెలలు కష్టపడితే దేహాకృతి సాధించవచ్చు అనుకున్నాను. కానీ సిక్స్ ప్యాక్ రావడానికి ఏకంగా 10 నెలల సమయం పట్టింది. ఇక ఆ తర్వాతే తొలి షాట్ తీశారు. అయితే సినిమా పూర్తయ్యాక  ఇక నేను పడిన కష్టాన్ని తెరమీద చూసుకుంటే ఎంతో సంతోషంగా అనిపించింది అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: