ఒక టాప్ హీరో క్రేజ్ తారా స్థాయిలో ఉన్నప్పుడు ఆహీరో తన కెరియర్ కు సంబంధించి సేఫ్ గేమ్ ఆడాలని చూస్తారు కాని తమ కెరియర్ కు సంబంధించి ఎలాంటి ప్రయోగాలు చేయడానికి ఇష్టపడరు. అయితే ప్రభాస్ మాత్రం ఈ లెక్కలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ‘ఆదిపురుష్’ సినిమాలో నటించడమే కాకుండా ఆసినిమా విజయం పై భారీ ఆశలు పెట్టుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.


వాస్తవానికి తెలుగు రాష్ట్రాలలో రామాయణానికి సంబంధించిన సినిమా అనగానే ఎవరికైనా వెంటనే నందమూరి తారకరామారావు నటించిన శ్రీరాముడి పాత్రలు గుర్తుకు వస్తాయి. ప్రభాస్ శ్రీరాముడుగా ఎంత కష్టపడి చేసినా వెంటనే ఎన్టీఆర్ నటనతో ప్రభాస్ నటనను పోల్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. సాధారణంగా టాప్ హీరోలు యాక్షన్ సినిమాలు చేయాలని అనుకుంటారు. కుదరకపోతే లవ్ స్టోరీలలో నటిస్తారు. అయితే పౌరాణిక పాత్రలు చేయడానికి ఎవరూ సాహసించరు. అయితే ప్రభాస్ ఈ సాహసం చేయడం ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది.


నిజానికి ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ కు సరైన హిట్ లేదు అతడి మార్కెట్ ఏమాత్రం పెరగలేదు సరికదా ప్రభాస్ మూవీ పై కోట్లు పెట్టుబడి పెట్టడానికి బయ్యర్లు కొంతవరకు ఆలోచన చేస్తున్నారు అన్నవార్తలు కూడ వచ్చాయి. ప్రభాస్ తన కెరీర్ లో చేస్తున్న మొదటి మైథలాజికల్ మూవీ.  ఇంతకముందు ఇలాంటి పాత్రలు చేసిన అనుభవం ప్రభాస్ కు లేదు.  దీనికితోడు ప్రభాస్ గొంతులో గాంభీర్యం ఉండదు. దీనితో పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రభాస్ నోటివెంట వచ్చినప్పుడు ధియేటర్ లోని సగటు ప్రేక్షకుడు ఎలా స్పందిస్తాడు అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది. అయితే ఈమూవీ ట్రైలర్ కు వచ్చిన స్పందన చూసిన వారు మాత్రం ప్రభాస్ ఎదో అద్భుతం చేయబోతున్నాడు అంటూ అంచనాలలో ఉన్నారు. సమ్మర్ రేస్ ఎటువంటి సందడి లేకుండా జరిగిన పరిస్థితులలో సమ్మర్ ముగింపుకు ప్రభాస్ ఏదైనా ఫినిషింగ్ టచ్ ఇస్తారా అన్న ఆశతో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి..మరింత సమాచారం తెలుసుకోండి: