నిహారిక అంతకంతకు గ్లామర్ డోస్ పెంచుతుండగా మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.కొంచెం పద్దతిగా ఉండు అంటూ సలహా కూడా ఇస్తున్నారు.

నిహారిక లేటెస్ట్ ఫోటో షూట్ బాగా వైరల్ అవుతుంది. ఏకంగా ప్యాంటు లేకుండా కెమెరా ముందుకు అయితే వచ్చింది. డెనిమ్ టాప్ ధరించిన నిహారిక లుక్ బోల్డ్ గా ఉంది.

కాగా 'డెడ్ పిక్సెల్స్' టైటిల్ తో నిహారిక ఓ వెబ్ సిరీస్ ను చేశారు. హాట్ స్టార్ లో మే 19 నుండి ఇది స్ట్రీమ్ అవుతుంది.. డెడ్ పిక్సెల్స్ సిరీస్ ఓ వీడియో గేమ్ ఆధారంగా అయితే తెరకెక్కింది. ఆన్లైన్ గేమ్స్ యూత్ ని బాగా ఊపేస్తున్నాయి. ఈ గేమ్ పార్టనర్స్ లైఫ్ పార్టనర్స్ గా కూడా మారిపోతున్నారు. ఆ కాన్సెప్ట్ తో డెడ్ పిక్సెల్స్ తెరకెక్కిందని తెలుస్తుంది..

నిహారిక ఈ సిరీస్లో గాయత్రి అనే పాత్ర చేశారు. తనతో పాటు ఆన్లైన్ గేమ్ ఆడే పాత్రల్లో అక్షయ్ లాగుసాని, వైవా హర్ష కూడా నటించారు. ఇద్దరి వ్యక్తులను ఇష్టపడే అమ్మాయిగా నిహారిక క్యారెక్టర్ ను చూపించారు. నిహారిక ఓ డైలాగ్ ను కూడా చెప్పారు. 'రోషన్ ఇన్ బెడ్... భార్గవ్ ఇన్ మైండ్' అని నిహారిక చెప్పిన బోల్డ్ డైలాగ్ బాగా వైరల్ అవుతుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో నిహారిక పాల్గొంటున్నారు.

కొద్దిరోజులుగా నిహారిక విడాకులు వార్తలు హడావుడి చేస్తున్నాయి. నిహారిక-వెంకట చైతన్య ఈ మధ్య కాలంలో కలిసింది లేదు.. మార్చిలో వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన నేపథ్యంలో ఈ పుకార్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ వాదనలకు బలం చేకూర్చుతూ నిహారిక కూడా పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ నుండి తొలగించారు. నిహారిక-వెంకట చైతన్య విడాకులు ఖాయమేనని కూడా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

అలాగే నిహారిక మాత్రం కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నారు. హైదరాబాద్ లో ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: