
ఈసారి సమ్మర్ రేస్ కు టాప్ హీరోల సినిమాలు దూరం అవడంతో చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాల హవా మాత్రమే కొనసాగింది. దీనితో ప్రేక్షకులు లేక ధియేటర్లు వెలవెల పోయాయి. అయితే సమ్మర్ రేస్ కు ముగింపుగా వస్తున్న ‘ఆదిపురుష్’ తో బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.
దీనికి తగ్గట్టుగానే ఈమూవీ పై అంచనాలు కూడ భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ అంచనాలను మరింత రెట్టింపు చేయడానికి ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను జూన్ 6న తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబాయ్ నుండి భారీగా సింగర్స్ తో పాటు ఈ ఈవెంట్ కోసం 200 వందల మంది డాన్సర్స్ రాబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
ఈ ఈవెంట్ కు తెలుగురాష్ట్రాల నుండి ప్రభాస్ అభిమానులను ప్రత్యేకమైన ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేసి సుమారు లక్షకు మంది తగ్గకుండా ఈ ఈవెంట్ కు తీసుకురావాలని చాల గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్. అంతేకాదు ఈ ఈవెంట్ కోసం ఒక ప్రత్యేకమైన క్రాకర్స్ ను లక్షలు ఖర్చుపెట్టి శివకాశి లో డిజైన్ చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రాకర్స్ పైకి వెళ్ళి పేలగానే రంగురంగుల కాంతులతో పాటు ‘జై శ్రీరామ్’ అన్న శబ్దం వచ్చే విధంగా ఈ క్రాకర్స్ ను తయారు చేయించడానికి సుమారు 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంటున్నారు. అత్యంత ఘనంగా భారీ సెట్టింగ్ మధ్య జరగబోయే ఈ ఈవెంట్ కు సుమారు 2కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని అంటున్నారు. ఈ ఈవెంట్ తరువాత తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ‘జై శ్రీరామ్’ నినాదంతో ‘ఆదిపురుష్’ మ్యానియా తారాస్థాయికి చేరవచ్చని నిర్మాతల అంచనా. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ‘ఆదిపురుష్’ మూవీ కలక్షన్స్ రెండు వారాలు పూర్తి అయ్యే సరికి 1000 కోట్లు వచ్చే విధంగా వ్యూహాలు రచిస్తున్నారని టాక్..