స్టార్ హీరోల సినిమాలకు టైటిల్ ఎంత ముఖ్యమో ట్యాగ్ లైన్ కూడా అంతే ముఖ్యం. ట్యాగ్ లైన్ విషయంలో దర్శకులు ఎంత జాగ్రత్తలను వహిస్తారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ ట్యాగ్ లైన్ వల్లే సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడతాయి. ఇకపోతే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమాకు హైలి ఫ్లేమబుల్ అనే ట్యాగ్ లైన్ ఉంది. అయితే ఈ ట్యాగ్ లైన్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి చాలా నచ్చింది. అయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన రాఖి సినిమాకు కూడా ఇదే ట్యాగ్ లైన్ ఉంది. 

ఇక తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అటు మహేష్ ఇటు తారక్ ఫ్యాన్స్ ఈ ట్యాగ్ లైన్ ని చూసి షాక్ అవుతున్నారు.ఎన్టీఆర్ రాఖీ సినిమాకు ఉన్న ట్యాగ్ లైన్ గురించి తెలియకపోవడం వల్లే ఇలా జరిగిందా లేక తెలిసే ఇలాంటివి ట్యాగ్ లైన్ ని పెట్టారా అన్న ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక మరోవైపు తాజాగా మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం గ్లిమ్ప్స్ వీడియోకి వస్తున్న రెస్పాన్స్ అంత ఇంతా కాదు. ఇక ఆ గ్లిమ్ప్స్ వీడియోకి ఏకంగా 20 మిలియన్ల వ్యూస్ రావడం జరిగింది. దీంతో మహేష్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

 ఇక మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా వచ్చే సంవత్సరం జనవరి 13న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. దాదాపుగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి నెట్ ఫిక్స్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మహేష్ ఫ్యాన్స్. దీంతో మహేష్ బాబు కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: