విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా నటుడుగా రాజకీయ నాయకుడుగా అన్నింటా మించి తెలుగు ప్రజలు చిరకాలం గుర్తుంచుకునే మహోన్నత వ్యక్తిగా ఆయన గురించి అనేక విషయాలు ప్రముఖ మీడియా సంస్థలు కథనాలుగా ప్రచరిస్తూనే ఉన్నాయి. అలాంటి గొప్ప వ్యక్తిత్వం గల ఎన్టీఆర్ లేడీ అమితాబ్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసిన విజయశాంతికి శారీ చెప్పారట.విజయశాంతి బాలనటిగా 14 ఏళ్ళ వయసులో కెరీర్ ప్రారంభ దశలో అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లు కలిసి నటించిన మూవీలో ‘సత్యం శివం’ మూవీలో ఎన్టీఆర్ కు చెల్లెలుగా నటించింది. ఆతరువాత ఎన్టీఆర్ సినిమాలను వదిలి రాజకీయాలలోకి వచ్చి ముఖ్యమంత్రి గా మారారు. విజయ శాంతి ఆ తరువాత టాప్ హీరోయిన్ గా మారిపొయింది.


1985లో ఎన్టీఆర్ చేతుల మీదుగా ‘ప్రతిఘటన’ లో నటనకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకునే స్థాయికి ఎదిగి పోయింది. ఆతరువాత 1990లో ఎన్టీఆర్ తిరిగి మేకప్ వేసుకుని  ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా తీసి ఆ సినిమా డబ్బింగ్ కోసం ఒక స్టూడియోలో ఉండగా అదే స్టూడియోలో విజయశాంతి చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీ షూటింగ్ అక్కడ జరుగుతూ ఉండగా పక్క ఫ్లోర్ లో ఎన్టీఆర్ ఉన్నారని తెలుసుకుని ఆయనను పలకరించాలని విజయశాంతి అక్కడకు వెళ్లిందట. అయితే డబ్బింగ్ పనుల బిజీలో ఉన్న ఎన్టీఅర్ విజయశాంతిని గుర్తు పట్టలేదట.


అయితే ఆతరువాత విజయ్ శాంతి తనను పలకరించడానికి వచ్చింది అన్న విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ బాధపడి మరుసటి రోజు ఆమెకు శారీ చెప్పడానికి ఆమె ఇంటికి వెళ్లారట. అయితే ఆమె అవుట్ డోర్ షూటింగ్ కు వెళ్ళింది అని తెలుసుకుని ఆమె ఫోన్ నెంబర్ ఆమె కుటుంబ సభ్యుల దగ్గర తీసుకుని ఆమెకు ఫోన్ చేసి ఎన్టీఆర్ శారీ చెప్పారట. ఈ అనుకోని సంఘటనకు షాక్ అయిన విజయశాంతి ఆ షాక్ నుండి బయటకు రావడానికి చాల రోజులు పట్టిందట..


మరింత సమాచారం తెలుసుకోండి: