
దీంతో ఈ చిత్రం విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేస్తున్నారు చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతిలో చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆది పురష్ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్లు సైతం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. రేపటి రోజున ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని మేకర్స్ భారీగానే ప్లాన్ చేస్తున్నారు.ఈ కార్యక్రమం తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ గెస్ట్ గా చిన్న జీయర్ స్వామి విచ్చేయనున్నట్లు అధికారికంగా తెలియజేశారు చిత్ర బృందం. అంతేకాకుండా ఒక పోస్టర్ తో కూడిన ట్విట్టర్ వేదికగా షేర్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన పలువురు నేటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. చిన్న జీయర్ స్వామి.. సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు రావడం ఇదే మొదటిసారి కావడంతో ఈ సినిమా పైన భారీ హైప్ క్రియేట్ అవుతున్నాయి.. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే జూన్ 16వ తేదీ వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.