ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రస్తుతం సౌత్ సినిమా లు సత్తా చాటుతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం పెద్ద సినిమాలే కాకుండా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న చిన్న సినిమాలు సైతం మంచి ఆదరణను కనబరుస్తున్నాయి. అంతేకాదు భాషతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వస్తువులను రాబడుతున్నాయి ఇప్పటి సినిమాలు.  చాలామంది బాలీవుడ్ స్టార్స్ దృష్టి అంతా కూడా ఇప్పుడు దక్షిణాది సినిమాలపై పడింది. ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న చాలామంది దృష్టి టాలీవుడ్ సినిమాలపై పడింది.ఈ క్రమంలోనే హిందీ స్టార్స్ అందరూ కూడా తెలుగు తమిళ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

అయితే ఇప్పటికే స్టార్ హీరో అయిన సైఫ్ అలీ ఖాన్ ఆది పురుష్ సినిమాతో టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. మరోవైపు బాలీవుడ్ క్రేజీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న జాన్వి కపూర్ సైతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్గా నటిస్తూ తెలుగు తెరకు పరిచయం అవుతుంది. అంతేకాదు మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సైతం తెలుగుతరకు పరిచయమయ్యాడు .అయితే తాజాగా ఇప్పుడు మరొక బాలీవుడ్ స్టార్ హీరో సౌత్ సినిమాలో చేయాలని ఉంది అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టాడు .ఇకపోతే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన బ్లడీ డాడీ జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

 డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఈ 2011లో వచ్చిన ఫ్రెండ్స్ మూవీ స్లీప్ లెస్ నైట్ సినిమాకి అడాప్షన్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ ఓటిటి జియో లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోని ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఒకవేళ మీకు హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా అని ప్రశ్నించగా.. హాలీవుడ్ లో ఏదో ఒక చెత్త పాత్ర చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు.. ఆ సినిమాల్లో నటించడం కంటే తమిళ్ తెలుగు మలయాళం సినిమాల్లో నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తాను. ఎందుకంటే తెలుగు సినిమాల్లో నటనకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు ఉంటాయి. ఈ సినిమాల్లో చేస్తే నటుడిగా ఇంకొంచెం బెటర్ అవుతాను. ఈ సినిమాల్లో నటించే అవకాశం వస్తే నటుడిగా నన్ను నేను బెటర్ చేసుకునే సినిమాలుగా ఇవి ఉపయోగపడతాయి. అంటూ సంచలన వ్యాఖ్యలను చేశారు షాహిద్ కపూర్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: