యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా విడుదల అవటానికి రెడీగా ఉంది. జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్ లలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.ఈ క్రమంలో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తే హిట్ అయినట్టు అనే దానిపై సోషల్ మీడియాలో చాలా భారీ ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉంది. దాదాపు ₹500 కోట్ల మేర బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా థియేట్రికల్ హక్కులతో అదే రీతిలో బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల నుండి  సమాచారం తెలుస్తుంది.దీంతో సినిమా మినిమం ₹500 కోట్లు వసూలు చేస్తే గాని “ఆదిపురుష్” హిట్ అయినట్టు కాదని అంటున్నారు.  వేదికగా తెలుగు భాషకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ వేడుకలో సెకండ్ ట్రైలర్ ని లాంచ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. ఈ వేడుకతో మరింతగా సినిమాకి పబ్లిసిటీ వచ్చింది. ఖచ్చితంగా సినిమా లాభాలు తెచ్చిపెడుతుందని మేకర్స్ భావిస్తున్నారు.


 ముఖ్య అతిథిగా చిన్న జీయర్ స్వామి హాజరు అవ్వడం విశేషం. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించడం జరిగింది. ఇంకా సీత పాత్రలో హాట్ హీరోయిన్ కృతి సనన్ నటించింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్ ఇంకా పాటలు సినిమాపై అంచనాలను పెంచేయడం జరిగింది.పైగా ఈ సినిమాకి పోటీగా మరో పెద్ద సినిమా ఏది కూడా లేదు. దీంతో సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కానీ ఖచ్చితంగా లాభాల పంట గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది జనవరి నెలలో విడుదల కావాల్సింది. కానీ గ్రాఫిక్స్ ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేకపోవడంతో… మొత్తం మార్చి ఇప్పుడు లేటెస్ట్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి జూన్ 16 వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. చూడాలి ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: