ఉపాసన డెలివరీకి సమయం దగ్గరపడుతుండగా ఆమె ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. పుట్టబోయే బిడ్డ కార్డు బ్లడ్ భద్రపరచనున్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. భవిష్యత్ లో బిడ్డకు ఏమైనా సమస్యలు వస్తే ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాయ, బొడ్డు నుండి రక్తం సేకరించి ప్రత్యేక పద్ధతిలో భద్రపరుస్తారు. అవసరమైనప్పుడు కార్డ్ బ్లడ్ వాడి వ్యక్తులను రోగాల నుండి కాపాడవచ్చు.
ఈ విధానం స్టెమ్ సైట్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. ఆ సంస్థ ద్వారా ఉపాసన బిడ్డ కార్డు బ్లడ్ సేకరించి భద్రపరచనున్నారు. ఈ మేరకు ఉపాసన ప్రకటన చేశారు. ఇక పెళ్ళైన వెంటనే పిల్లలను కనకూడదని ఉపాసన నిర్ణయం తీసుకుందట. ఈ విషయంలో కుటుంబ సభ్యులు, సమాజం నుండి ఒత్తిడి ఎదురైనా వెరవకుండా మా నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఉపాసన చెప్పుకొచ్చారు.ఉపాసన అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్ గా ఉన్నారు. అలాగే ఆమె అనేక ఇతర వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక మూవీ ప్రకటించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి