నాచురల్ స్టార్ నాని తాజాగా దాసర అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇదే నాని కెరియర్ లో రూపొందిన మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ లో కనిపించి తన నటనతో ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు.

దసరా మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న నాని ప్రస్తుతం తన కెరియర్ లో 30 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మృనాల్ ఠాగూర్ ... నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ అనుకున్న దాని కంటే స్పీడ్ గా ఈ మూవీ చిత్ర షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దానితో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన 70% షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తుంది.

ఆగస్టు నెల నాటికి ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ ప్రమోషన్ లకు చాలా సమయం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఈ మూవీ యూనిట్ కు చాలా బాగా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ కోనూరులో ఉండబోతుంది. ఈ షెడ్యూల్ లో ఈ చిత్ర బృందం ఈ సినిమాలోని చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: