సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా బేబీ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జూలై 14 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఇకపోతే ఈ మూవీ ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు రోజు వారిగా ప్రపంచ వ్యాప్తంగా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.48 కోట్ల షేర్ ... 6.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.56 కోట్ల షేర్ ... 6.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.39 కోట్ల షేర్ ... 7.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ సినిమాకు మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 11.33 కోట్ల షేర్ ... 20.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 7.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 8 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగింది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని 3.33 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: