బాలయ్యతో విజయశాంతి కి సత్సంబంధాలే కానీ ఎఫైర్లు లేవని ఇమంది రామారావు అన్నారు. అటు బాలయ్య, ఇటు విజయశాంతి భోళా మనుషులని ఆయన వెల్లడించారు. బాలయ్య, విజయశాంతి లకు ఒకరిపై ఒకరికి అభిమానం ఉందని ఇమంది రామారావు అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ సైతం విజయశాంతిని ఎంతో గౌరవించేవారని ఆయన కామెంట్లు చేశారు. విజయశాంతి తన పెళ్లి విషయాన్ని ఆలస్యంగా వెల్లడించారని ఇమంది రామారావు అన్నారు.
విజయశాంతి భర్త సీనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి దగ్గర బంధువు అని ఇమంది రామారావు వెల్లడించారు. తెలంగాణ కోసం విజయశాంతి ఎంతో కష్టపడ్డారని ఆయన పేర్కొన్నారు. అద్వానీ ఉన్న సమయంలో విజయశాంతికి మంచి ప్రాధాన్యత దక్కిందని ఆయన చెప్పుకొచ్చారు. బాలయ్య విజయశాంతి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని ఇమంది రామారావు స్పష్టం చేశారు. ఇకనైనా ఈ తరహా వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది. బాలయ్య భగవంత్ కేసరి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి