బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎంత బిజీగా మారినా స్టార్స్ ఎవరైనా సరే వారి గురించి చెప్పాల్సి వస్తే మాత్రం ఏ మాత్రం సంకోచించదు.తాజాగా ఈమె ఐశ్వర్యరాయ్ మీద చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. వాస్తవానికి ఈమె మాటలు సూటిగా ఉంటాయని చెప్పవచ్చు. ఎప్పుడు ఏది అనిపిస్తే అది టక్కున అనేస్తుంది ఈ ముద్దుగుమ్మ .అంతేకాదు ఎవరినైనా ఏదైనా అనాలన్నా కూడా వారు ఎంతటి వారు అనేది ఏ మాత్రం చూసుకోదు వెంటనే మాట అనేస్తుంది.

అంతేకాదు ఏదైనా అనిపిస్తే ముఖం మీద చెప్పేస్తూ తన మనసులోని భావాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బయటపెడుతూ ఉంటుంది. ఎవరికి భయపడకుండా ఏమైనా చేస్తారన్న భయం కూడా లేకుండా అందరిపై విరుచుకుపడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా ఐశ్వర్యరాయ్ పై చేసిన కామెంట్లు ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారుతున్నాయి. 40,50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఆడవారిని ఎవరూ పట్టించుకోరు అంటూ కాంట్రవర్సియల్ స్టేట్మెంట్ ఇవ్వడంతో వివాదాన్ని రేపే ప్రయత్నాలు చేస్తూ ఒక చిన్న వివాదమే సృష్టించిందని చెప్పవచ్చు.

ఇకపోతే బాలీవుడ్లో క్వీన్ గా వెలిగిపోతూ కూడా అక్కడ వారు చేసే కొన్ని పనులు మాత్రం తనకు నచ్చవు అంటూ బాలీవుడ్ పై కొంతమంది స్టార్స్ పైన గట్టిగా వ్యతిరేకించిన ఎన్నోసార్లు తన మాటలతో బాలీవుడ్ నే దుమ్ము దులిపేసింది. ఇకపోతే సాంగ్ రైటర్స్ అనేవారు కేవలం అమ్మాయిల అందం పైన ఫోకస్ చేస్తున్నారు అని, వారిపై మాత్రమే పాటలు రాస్తున్నారని, 40, 50 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా ఆడవారు ఎంత అందంగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదని కంగనా కామెంట్లు చేసింది.

అంతేకాదు తాను అన్న మాటను సమర్ధించుకోవడానికి మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాను ఉదాహరణగా చూపిస్తూ ఈ మూవీ నుంచి ఐశ్వర్యరాయ్ క్లిప్ ఒకటి షేర్ చేసింది. ఇందులో ఐశ్వర్య చాలా అందంగా అసలు చూపు తిప్పుకోనివ్వకుండా ఉంది. ఇందులో మణిరత్నం హీరోయిన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.. అంటే ఏజ్ పెరిగిన ఆడవారికి కూడా ఆయన ఎంతో విలువ ఇచ్చారు. బాలీవుడ్లో అలా చేయగలరా అంటూ సూటిగా ప్రశ్నించింది. మూవీ లో ఇద్దరు కూడా మంచి స్మార్ట్ గా అందంగా ఉన్నారు అందమైన చందమామలు అంటూ తాను షేర్ చేసిన వీడియో గురించి రాసుకు రావడం తో ఐశ్వర్యరాయ్ అందం గురించి కంగనా ప్రశంసించడం ఏంటి ?చందమామ అని పిలవడం ఏంటి ? అంటూ కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: