నిన్న అనగా ఆగస్టు 24 వ తేదీన 2021 వ సంవత్సరానికి సంబంధించిన నేషనల్ అవార్డు లను ప్రకటించారు. అందులో భాగంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఏకంగా 10 కేటగిరీలలో అవార్డులు వచ్చాయి. మొత్తంగా ఈ పది కేటగిరీలలో నాలుగు తెలుగు సినిమాలకు అవార్డులు వచ్చాయి. ఆ కేటగిరీలు ఏమిటి ...? ఆ సినిమాలు ఏమిటో తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమాకు 2021 వ సంవత్సరానికి గాను ఆరు క్యాటగిరి లలో నేషనల్ అవార్డ్స్ దక్కాయి. ఈ మూవీ కి బెస్ట్ పాపులర్ ఫిలిం అవార్డు , బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవార్డు , బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డు , బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు , బెస్ట్ కొరియో గ్రాఫర్ అవార్డు , బెస్ట్ యాక్షన్ కొరియో గ్రాఫర్ అవార్డు లు దక్కాయి.

పుష్ప : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించగా ... రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే తాజాగా ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లలో ఈ మూవీ కి రెండు కేటగిరీ లలో అవార్డులు దక్కాయి. ఈ మూవీ కి బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ కు అవార్డు దక్కగా , బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ కి అవార్డు దక్కింది.

కొండపొలం : పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు తాజాగా ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ లిరిసిస్ట్ క్యాటగిరి లో చంద్రబోస్ కి అవార్డు దక్కింది.

ఉప్పెన : పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు బెస్ట్ తెలుగు ఫిలిం క్యాటగిరి లో నేషనల్ అవార్డు దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: