రామ్ పోతినేని , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని కొంత కాలం క్రితం సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇక ఆ తర్వాత ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన కాకుండా సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించింది.

దానికి నందమూరి నట సింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇకపోతే ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది.

అలాగే ఈ మూవీ ని 2 గంటల 47 నిమిషాల 22 సెకండ్ల నిడివితో  ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ రామ్ మరియు బోయపాటి కెరీర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

ram